మీ iPhone లేదా iPad అప్‌డేట్ చేయనట్లయితే
మీ iPhone లేదా iPadని అప్‌డేట్ చేయడానికి, మీకు అనుకూలమైన పరికరం, ఇంటర్నెట్ కనెక్షన్ మరియు తగినంత స్టోరేజి అవసరం.
మీరు మీ iPhone లేదా iPadలో iOS లేదా iPadOS తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేయలేకపోతే
ఈ క్రింది కారణాల్లో ఒకదాని వల్ల మీరు మీ iPhone లేదా iPadని వైర్‌లెస్‌గా లేదా ఓవర్ ది ఎయిర్‌గా అప్‌డేట్ చేయలేకపోవచ్చు:
మీ పరికరం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మద్దతు ఇవ్వనట్లయితే
మీ పరికరం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మద్దతు ఇస్తుందా, లేదా అని తనిఖీ చేయడానికి:
మీ పరికరం అనుకూలంగా ఉంటే, మీకు అందుబాటులో ఉన్న iOS లేదా iPadOS యొక్క తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. మీకు అనుకూలమైన పరికరం ఉండి, మీ iPhone లేదా iPad అప్‌డేట్ కాకపోతే, దిగువ దశలను ప్రయత్నించండి.
అప్‌డేట్ చేయడానికి తగినంత స్థలం లేకపోతే
అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ పరికరంలో తగినంత స్టోరేజి స్థలం అవసరం. మీ వ్యక్తిగత డేటాపై ప్రభావం చూపకుండా మీరు మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోగల యాప్ డేటాను మీ పరికరం తొలగిస్తుంది.
మీరు సెట్టింగ్‌లు > జనరల్ > [పరికరం పేరు] నిల్వలో ఉపయోగించని కంటెంట్ మరియు యాప్‌లను తీసివేయండి.
మీకు Apple Intelligence ఉపయోగించడానికి ఎక్కువ స్థలం అవసరమైతే ఏమి చేయాలనేది తెలుసుకోండి.
డౌన్‌లోడ్ ఎక్కువ సమయం తీసుకుంటే
మీ పరికరాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. డౌన్‌లోడ్ సమయం అప్‌డేట్ పరిమాణం మరియు మీ ఇంటర్నెట్ వేగం మీద ఆధారపడి ఉంటుంది. మీరు డౌన్‌లోడ్ సమయంలో కూడా మీ పరికరాన్ని ఉపయోగించవచ్చు మరియు అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరికరం మీకు తెలియజేస్తుంది.
వేగవంతమైన డౌన్‌లోడ్‌ల కోసం:
Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవ్వండి.
మీ పరికరాన్ని అప్‌డేట్ చేస్తున్నప్పుడు ఇతర కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడాన్ని నివారించండి.
మీరు అప్‌డేట్ సర్వర్‌ను చేరుకోలేకపోతే లేదా అప్‌డేట్‌ను ధృవీకరించకపోతే
మీరు మీ పరికరాన్ని అప్‌డేట్ చేయడానికి ప్రయత్నిస్తే, మీకు ఈ సందేశాలలో ఒకటి కనిపించవచ్చు:
"అప్‌డేట్ కోసం తనిఖీ చేయడం సాధ్యం కాలేదు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం తనిఖీ చేస్తున్నప్పుడు లోపం సంభవించింది."
"అప్‌డేట్ కోసం తనిఖీ చేయడం సాధ్యం కాలేదు. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోవడం వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం తనిఖీ చేయడం విఫలమైంది."
"డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాలేదు. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోవడం వల్ల, ఈ అప్‌డేట్ అందుబాటులో లేదు."
"డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాలేదు. ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి Wi-Fi నెట్‌వర్క్ కనెక్షన్ అవసరం."
అదే నెట్‌వర్క్‌ని ఉపయోగించి మీ పరికరాన్ని మళ్లీ అప్‌డేట్ చేయడికి ప్రయత్నించండి. మీరు ఇప్పటికీ ఈ సందేశాలలో ఒకదాన్ని చూస్తున్నట్లయితే, మీ పరికరాన్ని మరొక నెట్‌వర్క్ ఉపయోగించి అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించండి లేదా Mac ఉపయోగించి లేదా iTunes ఉపయోగించి ప్రయత్నించండి. బహుళ నెట్‌వర్క్‌లతో అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత సమస్య మళ్ళీ సంభవిస్తే, అప్‌డేట్‌ను తొలగించండి..
అప్‌డేట్ పూర్తి కాకపోతే
మీరు అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంటే, ప్రోగ్రెస్ బార్ నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించవచ్చు. అప్‌డేట్ పట్టే సమయం అప్‌డేట్ పరిమాణం మరియు మీ పరికరంలోని ఫైల్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
మీరు ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు, మీ పరికరాన్ని పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయండి. మీ పరికరంలో పవర్ అయిపోతే, దాన్ని పవర్ సోర్సుకు కనెక్ట్ చేసి, అప్‌డేట్ లేదా పునరుద్ధరణ పూర్తి కావడానికి పరికరాన్ని ఆన్ చేయండి.
మీ iPhone ఆన్ కాకపోతే లేదా స్తంభింపజేసినట్లయితే కథనాన్ని తెరవడానికి క్లిక్ చేయండి iPhone లేదా iPad స్తంభించినట్లు కనిపిస్తుంది లేదా ప్రారంభం కాదు.
మీరు ఇప్పటికీ iOS లేదా iPadOS తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయలేకపోతే
మీరు ఇప్పటికీ iOS లేదా iPadOS యొక్క తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయలేకపోతే, అప్‌డేట్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి:
సెట్టింగ్‌లు > జనరల్ > [పరికర పేరు] నిల్వకు వెళ్లండి.
యాప్‌ల జాబితాలో అప్‌డేట్‌ను కనుగొనండి.
అప్‌డేట్‌ను ట్యాప్ చేయండి, ఆపై అప్‌డేట్‌ను తొలగించు ట్యాప్ చేయండి.
సెట్టింగ్‌లు > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు వెళ్లండి మరియు తాజా అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
యాప్‌ల జాబితాలో మీకు అప్‌డేట్ కనిపించకపోతే లేదా సమస్య మళ్ళీ సంభవిస్తే, మీరు మీ పరికరాన్ని అప్‌డేట్ చేయాలి Macని ఉపయోగించడం లేదా iTunes ఉపయోగించి.
మీ కంప్యూటర్ మీ పరికరాన్ని గుర్తించకపోతే లేదా మీ స్క్రీన్ ప్రోగ్రెస్ బార్ లేకుండా Apple లోగోను చాలా నిమిషాలు ప్రదర్శిస్తుంటే రికవరీ మోడ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మరింత సహాయం కావాలా?
ఏమి జరుగుతుందనే దాని గురించి మాకు మరింత తెలియజేయండి మరియు తదుపరి మీరు ఏమి చేయగలరో మేము సూచిస్తాము.